News July 4, 2024
జులై 11న CA ఫలితాలు: ICAI

ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ICAI అధికారిక ప్రకటన చేసింది. మేలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను జులై 11న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నెంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చని పేర్కొంది.
Similar News
News March 3, 2026
ఇరాన్ చర్చలకు సిద్ధం అంటోంది: ట్రంప్

ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని, కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ యుద్ధం 4-5 వారాలపాటు కొనసాగవచ్చని తెలిపారు. ఆ లోపు ముగించేస్తామని, ఇజ్రాయెల్-US దళాలకు ఇది పెద్ద కష్టం కాదని చెప్పారు.
News March 3, 2026
నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్

TG: నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను CM రేవంత్ ఆదేశించారు. MAR 6 నుంచి JUNE 12 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై దిశానిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ పథకాలు, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను సమీప మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు సమయానికి చెల్లించాలి’ అని సూచించారు.
News March 3, 2026
చంద్రగ్రహణం.. నేరుగా చూడవచ్చా?

మన దేశంలో చంద్రగ్రహణం ఏర్పడింది. మ.3.20 గం.కు ఇది ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలవారు 6.20PM నుంచి చూడొచ్చు. 6.47PMకు గ్రహణం ముగుస్తుంది. చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చని, ఎలాంటి ప్రత్యేక గ్లాసెస్ అవసరం లేదని సైంటిస్టులు వెల్లడించారు. సూర్యగ్రహణం మాదిరిగా ఇది ప్రమాదకరం కాదని, చంద్రకిరణాలు ఎలాంటి హాని చేయవని పేర్కొన్నారు.
Share It


