News December 28, 2024
CA ఫలితాల్లో ‘టాప్‘ లేపిన చిత్తూరు జిల్లా కుర్రాడు
జాతీయ స్థాయిలో జరిగిన చార్టెర్డ్ అకౌంటెంట్(CA) తుది ఫలితాల్లో చిత్తూరు జిల్లా వాసి అగ్రస్థానం కౌవసం చేసుకున్నాడు. తాజాగా వెలవడిన ఫలితాల్లో పలమనేరుకు చెందిన రిషబ్ ఓత్సవాల్ 600 మార్కులకు గాను 508 మార్కులు సాధించి మరో విద్యార్థితో సమానంగా నిలిచాడు. దీంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండిమా(ICIA) ఇద్దరికి ప్రథమ స్థానం కేటాయించింది. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News December 29, 2024
తిరుపతి: పరీక్షలు వాయిదా
తిరుపతి SV యునివర్సిటీ పరిధిలో జరుగుతున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఈ నెల 30 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 3వ తేదీకి మార్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని దామ్లా నాయక్ సూచించారు.
News December 29, 2024
కుప్పంలో ఫారెస్ట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
News December 28, 2024
చిత్తూరు: 30 నుంచి దేహదారుడ్య పరీక్షలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలకు ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. 990 మంది మహిళలు, 4248 మంది పురుషులు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ మేరకు సిబ్బందికి పోలీసు గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు.