News March 22, 2024

CAA హెల్ప్‌లైన్ నంబర్ 1032

image

CAA దరఖాస్తుదారుల సందేశాలు తీర్చడం, సమాచారం అందించడానికి కేంద్ర హోంశాఖ ‘1032’ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 2014 డిసెంబర్‌కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు పౌరసత్వానికి అర్హులు.

Similar News

News December 4, 2025

తాజ్‌మహల్ ఆగ్రాకు శాపంగా మారింది: బీజేపీ ఎంపీ

image

తాజ్‌మహల్‌పై బీజేపీ ఫతేపూర్ సిక్రి(UP) ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాజ్‌మహల్ కట్టడం ప్రపంచ ఆకర్షణ. కానీ కఠినమైన తాజ్ ట్రాపేజియం జోన్(TTZ), ఎన్జీటీ నిబంధనల వల్ల ఆగ్రా అభివృద్ధికి శాపంగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి ఆటంకం కలిగిస్తోంది’ అని లోక్‌సభలో అన్నారు. ఉపాధి, అభివృద్ధిని పెంచేందుకు, తాజ్ అందాన్ని కాపాడేందుకు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

News December 4, 2025

లెజెండరీ నిర్మాత కన్నుమూత

image

లెజెండరీ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాలను శరవణన్ నిర్మించారు. రజినీకాంత్, శివాజీ గణేశన్‌ వంటి ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేశారు. సంసారం ఒక చదరంగం, జెమినీ, శివాజీ, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, లీడర్ తదితర చిత్రాలు తెరకెక్కించారు.

News December 4, 2025

ఫీటస్ హార్ట్‌బీట్ రాకపోవడానికి కారణాలివే..!

image

ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అయ్యాక కొంతమంది తల్లులు వారి కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినలేకపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు. జన్యు సమస్యలు, hCG లెవల్స్ తగ్గి అబార్షన్ కావడం, పిండానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, తక్కువగా ఉమ్మనీరు ఉండడం, బిడ్డలో ఏవైనా లోపాలు, తల్లికి తీవ్ర అనారోగ్యాలు వంటివి కారణం కావొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తారు.