News April 24, 2024
CAA నిబంధనలు భారత రాజ్యాంగ విరుద్ధం: సీఆర్ఎస్

CAAలోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా చట్టసభ పరిశోధన విభాగం సీఆర్ఎస్ ఓ నివేదికలో పేర్కొంది. పాక్, బంగ్లా, అఫ్గాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన ఆ దేశాల మైనారిటీలకు సీఏఏ ద్వారా భారత్ పౌరసత్వం అందిస్తుంది. అయితే ముస్లింలను మినహాయించడం రాజ్యాంగానికి సమ్మతం కాదని సీఆర్ఎస్ పేర్కొంది. రాజకీయ కారణాలతోనే ఈ చట్టాన్ని సర్కారు తీసుకొచ్చిందని అభిప్రాయపడింది.
Similar News
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
News November 6, 2025
బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


