News October 15, 2024
క్యాబ్ డ్రైవర్ రాక్స్.. కస్టమర్ షాక్!

కస్టమర్ల ప్రవర్తనతో విసిగిపోయిన ఓ క్యాబ్ డ్రైవర్ కారులో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ వైరలవుతోంది. ‘నువ్వు క్యాబ్ ఓనర్ కాదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఈ క్యాబ్ ఓనర్. కాబట్టి ఆయనతో గౌరవంగా, మర్యాదగా మాట్లాడండి. కారు డోర్‌ను జాగ్రత్తగా క్లోజ్ చేయండి. మీరు మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు. మీ యాటిట్యూడ్‌ను మీ జేబులో పెట్టుకోండి. భయ్యా అని పిలవకండి. వేగంగా వెళ్లాలని చెప్పకండి’ అని పోస్టర్‌లో రాసుంది.
Similar News
News January 30, 2026
బంగారం డిమాండ్ తగ్గుతోంది: WGC

బంగారం ధర ఎఫెక్ట్ డిమాండ్‌పై పడింది. వివాహాల సీజన్ అయినా కొనుగోళ్లు పెరగకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతేడాదితో పోలిస్తే ఈసారి డిమాండ్ తక్కువేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2024లో 802.8 టన్నుల అమ్మకాలు జరగ్గా 2025లో 11% తగ్గి 710.9 టన్నులకు చేరింది. ఈ ఏడాది అది 600-700 టన్నులే ఉండొచ్చని WGC అంచనా వేసింది. 2024లో కొనుగోళ్ల విలువ రూ.5.75లక్షల కోట్లు కాగా 2025లో అది రూ.7.51లక్షల కోట్లకు చేరింది.
News January 30, 2026
ఈ హైబ్రిడ్ కొబ్బరి రకాలతో అధిక ఆదాయం

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.
News January 30, 2026
DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు

విశాఖపట్నంలోని DRDOకు చెందిన నావల్ సైన్స్& టెక్నలాజికల్ లాబోరేటరీ (<


