News February 1, 2025
5న క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాలు

TG: ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనుంది. క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశం నిర్వహించి వీటిని సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలపైనా సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. అటు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందనుంది.
Similar News
News March 7, 2025
ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఓటీఎస్ పథకం అమలు చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 సంవత్సరానికి ఓటీఎస్‌లో చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు అందులో పేర్కొంది. గతంలోనూ ప్రభుత్వం OTS అమలు చేయగా జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం చేకూరింది.
News March 7, 2025
గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల

TG: గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్‌ను TGPSC ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేస్తామని పేర్కొంది. 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా ఇస్తామని తెలిపింది. 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తామని వెల్లడించింది. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. 19న ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ తుది ఫలితాలు రిలీజ్ చేస్తామంది.
News March 7, 2025
ఆస్తులు అమ్మేసిన ప్రియాంక చోప్రా

నటి ప్రియాంక చోప్రా వెస్ట్ ముంబై అంధేరిలో ఉన్న తన ఆస్తులను అమ్మేశారు. ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లో ఆమెకు విలాసవంతమైన 4 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని రూ.16.17కోట్లకు విక్రయించారు. గతంలోనూ ఆమె ముంబైలోని 2 ఫ్లాట్లను అమ్మేశారు. ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్‌జోనస్, కుమార్తె మేరీ చోప్రాతో కలిసి లాస్ ఏంజెలిస్‌లో ఉంటున్నారు. అందువల్లే ఆమె ముంబైలో ఉన్న ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నట్లు సమాచారం.