News March 19, 2025
2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.
Similar News
News March 19, 2025
రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.
News March 19, 2025
బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు 40 నిమిషాల పాటు పలు ఒప్పందాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యోగాల కల్పనలో ఏఐ వినియోగంపై సమాలోచనలు జరిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కలిసివస్తుందని CBN పేర్కొన్నారు.
News March 19, 2025
చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు

చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై రేపటిలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని HC రద్దు చేసింది. చాహల్ IPLలో పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు ఇవ్వాలని సూచించింది. 2020లో వీరికి పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. చాహల్ రూ.4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించారు.