News October 23, 2025
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు క్యాబినెట్ ఆమోదం

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించగా తాజాగా సీఎం అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ధ్రువీకరించారు.
Similar News
News October 24, 2025
గెలుపు దిశగా భారత్

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ కీలక మ్యాచులో భారత అమ్మాయిలు ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నారు. 341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను 154 రన్స్‌కే 5 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. రేణుకా ఠాకూర్ 2 వికెట్లు తీయగా క్రాంతి, స్నేహ, ప్రతీకా రావల్ తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి మరో 5 వికెట్లు అవసరం. ఈ మ్యాచులో గెలిస్తే సెమీస్‌కు లైన్ క్లియర్ కానుంది.
News October 23, 2025
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

* రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం
* SLBC టన్నెల్‌ను పూర్తిచేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగు, సాగునీరు అందించాలని నిర్ణయం
* అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం
* కాలపరిమితి ముగియడంతో రామగుండంలోని 52ఏళ్ల నాటి థర్మల్ స్టేషన్‌ను తొలగించడానికి ఆమోదం
News October 23, 2025
రూ.79వేల కోట్ల ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోదం

రూ.79వేల కోట్లతో ఆయుధాలు, పరికరాలు కొనుగోలు చేసేందుకు త్రివిధ దళాలకు ఆమోదం లభించింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించారు. ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పిడోలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్, 30MM నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, ట్రాక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.