News January 17, 2025

సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై క్యాబినెట్‌లో చర్చ

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సచివాలయాల్లో RTGS ఏర్పాటుపై CM చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌లో చర్చ జరిగింది. అటు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Similar News

News November 14, 2025

ఐపీఎల్-2026 మినీ వేలం డేట్ ఫిక్స్!

image

ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరగనున్నట్లు ESPN తెలిపింది. వరుసగా మూడో ఏడాది విదేశాల్లోనే ఆక్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎప్పటిలాగే రోజు మొత్తం వేలం సాగే అవకాశముంది. ఈసారి అన్ని జట్లు పెద్ద మొత్తంలో ప్లేయర్లను వదులుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేలం ఆసక్తిగా మారనుంది. మరోవైపు పలు జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటున్నాయి.

News November 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 14, 2025

‘జూబ్లీహిల్స్’ ప్రస్థానమిదే..

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి మాగంటి గోపినాథ్(టీడీపీ, బీఆర్ఎస్) వరుసగా మూడు సార్లు గెలిచారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన అనారోగ్యంతో చనిపోగా ఈ నెల 11న ఉపఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది.