News January 11, 2025
సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ: TPCC చీఫ్

TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను మారుస్తున్నారన్న వార్తలపై తనకు సమాచారం లేదన్నారు. బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహించబోమని తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.
Similar News
News September 15, 2025
AI కంటెంట్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫొటోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతోపాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పేర్కొంది.
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.
News September 15, 2025
పాక్‌పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి హోటల్‌కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్‌డే కావడంతో స్పెషల్ కేక్ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్‌స్టా అకౌంట్లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.