News May 24, 2024
ఆగస్టు 15లోపు కేబినెట్ విస్తరణ?

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేబినెట్‌ను విస్తరించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారట. ఆగస్టు 15లోగా పూర్తి కేబినెట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాజ్‌గోపాల్‌రెడ్డి, జి.వివేక్, ప్రేమ్‌సాగర్ రావు, దేవరకొండ MLA బాలు నాయక్, మక్తల్ MLA వి.శ్రీహరి కేబినెట్ బెర్త్ కోసం ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు త్వరలో BRS నుంచి కాంగ్రెస్‌లో చేరే ఒకరిద్దరికీ అవకాశమున్నట్లు సమాచారం.
Similar News
News January 5, 2026
అవయవదానం ఫ్యామిలీకి రూ.లక్ష!

AP: అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది 93మంది జీవన్మృతుల నుంచి అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చినట్లు మంత్రి చెప్పారు.
News January 5, 2026
మళ్లీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాల కారణంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌పై కోపంతో మస్క్ ఒక పార్టీని కూడా ప్రకటించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. గత రాత్రి ట్రంప్, అతని భార్యతో కలిసి డిన్నర్ చేసినట్లు మస్క్ ఓ ఫొటో రిలీజ్ చేశారు. ‘2026 అద్భుతంగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 5, 2026
శివ మానస పూజ చేద్దామా?

మూర్తి పూజ కన్నా మానస పూజ ఎన్నో రెట్లు శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘నా ఆత్మయే శివుడు. నా శరీరమే ఆలయం’ అనే భావనతో శివ మానస పూజ చేస్తారు. బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా మదిలోనే శివుడిని ఆరాధించే ఈ ప్రక్రియను ఆదిశంకరాచార్యులు రచించారు. ఈ పూజతో మనసులో చింతలు తొలగుతాయని, శివసాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెబుతారు. శివ మానస పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


