News June 26, 2024
జులై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ?

TG: జులై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని HYD, RR, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి, మదన్మోహన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.
Similar News
News November 28, 2025
NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
News November 28, 2025
7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. BIG UPDATE

ఢిల్లీ పోలీస్ పరీక్షల(2025) తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులు ఉన్నాయి.
*కానిస్టేబుల్ (డ్రైవర్)- డిసెంబర్ 16, 17
*కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)- డిసెంబర్ 18 నుంచి జనవరి 6
*హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)- జనవరి 7 నుంచి 12
*హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, TPO)- జనవరి 15 నుంచి 22.
> పూర్తి వివరాలకు ఇక్కడ <
News November 28, 2025
గంభీర్‌పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో 0-2తో ఓటమి తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయనను వెంటనే తొలగించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. గంభీర్ తప్పుడు వ్యూహాలు, జట్టులో అతి మార్పులే ఈ పరాజయానికి కారణమని ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు రోహిత్ శర్మ, ద్రవిడ్, కోహ్లీ నిర్మించిన జట్టే కారణమని, గంభీర్ ప్రభావం లేదని తివారీ పేర్కొన్నారు.


