News October 29, 2024

క్యాబినెట్ విస్తరణ అప్పుడే..: సీఎం రేవంత్

image

TG: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ చేపడతామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు అధిష్ఠానం(ఏఐసీసీ)తో గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఐసీసీ అంటే తానేనని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన పేర్కొన్నారు. రోజులో ఎనిమిది గంటలు మూసీపైనే పని చేస్తున్నానని తెలిపారు. హైడ్రా వల్లే HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా ‘రియల్’ రంగంలో స్తబ్దత ఏర్పడిందని CM చెప్పారు.

Similar News

News January 11, 2026

APPLY NOW: NABARDలో 44 పోస్టులు

image

<>NABARD<<>>లో 44 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech, PG, B.Ed, BBA, డిగ్రీ (డిజిటల్ మీడియా, మల్టీ మీడియా, గ్రాఫిక్ డిజైన్, అగ్రికల్చర్, సాయిల్ సైన్స్, హార్టికల్చర్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nabard.org/

News January 11, 2026

‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

‘రాజాసాబ్’ సినిమా భారత్‌లో రెండు రోజుల్లో ₹108.4కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెబ్‌సైట్ పేర్కొంది. ప్రీమియర్లకు ₹11.3Cr, తొలి రోజు ₹64.3Cr, రెండో రోజు ₹32.84Cr కలెక్షన్స్ వచ్చినట్లు వెల్లడించింది. హిందీలో 2 రోజుల్లో ₹11.2Cr రాబట్టినట్లు తెలిపింది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹112Cr+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

News January 11, 2026

ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

image

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.