News June 20, 2024

త్వరలో మంత్రివర్గ విస్తరణ?

image

TG: మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో విస్తరణ ఉండొచ్చంటున్నారు. ఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్ చర్చించినట్లు సమాచారం. సీఎంతో పాటు కేబినెట్‌లో ప్రస్తుతం 11మంది మంత్రులున్నారు. ఇప్పటికైతే నలుగురికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ ఛాన్స్‌ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News

News January 7, 2026

ఏడాది లోపు పిల్లలకు కొబ్బరి నీరు ఇవ్వొచ్చా?

image

6 నెలలు దాటిన తర్వాత పిల్లలకు కొబ్బరి నీటిని చాలా తక్కువ పరిమాణంలో 1, 2 స్పూన్లు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. తర్వాత పరిమాణాన్ని నెమ్మదిగా పెంచాలి. మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన లేదా ఫ్లేవర్డ్ కొబ్బరి నీటిని అస్సలు ఇవ్వకూడదు, ఎందుకంటే వాటిలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. గ్యాస్, అతిసారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలుంటే వారికి కొబ్బరినీరు ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు.

News January 7, 2026

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? క్లారిటీ

image

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. బీరు తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలు ఒత్తిడికి గురై రాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీరులోని ప్యూరిన్‌తో యూరిక్ యాసిడ్ పెరిగి కొత్త రాళ్లు ఏర్పడవచ్చు. మూత్రంలో ప్రెజర్ పెరిగి రాయి బ్లాడర్‌లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.

News January 7, 2026

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు – కలుపు నివారణ

image

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణకు మొదటి 20- 25 రోజులు కీలక దశ. వరికొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా లీటరు నీటికి పారక్వాట్ కలుపు మందు 5mlను కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటలలోపు తేమ గల నేలపై పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో లీటరు నీటికి క్విజాలోఫోప్ ఈథైల్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.