News August 1, 2024

క్యాబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా

image

AP క్యాబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది. దాన్ని 7వ తేదీకి వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలను 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని సీఎస్ నీరభ్‌కుమార్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

Similar News

News October 14, 2025

పక్కదారి పడుతున్న PM కిసాన్ నిధులు

image

PM కిసాన్ నిధులు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికే నిధులు అందాలి. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భార్యాభర్తలు ఇద్దరికీ, భూమి పూర్వపు యజమానికి కూడా నిధులు జమవుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. మొత్తం 31 లక్షల కేసులను గుర్తించగా రాష్ట్రాలు 19.02 లక్షల కేసులను పరిశీలించాయి. వాటిలో 17.87 లక్షల మంది దంపతులు ఇద్దరూ నిధులు పొందుతున్నట్లు తేలింది.

News October 14, 2025

నేడు కీలక ఒప్పందం

image

AP: విశాఖలో ఏర్పాటు కానున్న 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం నేడు కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.88,628CR(10 బి.డాలర్ల)తో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌తో MOU కుదరనుంది. ఢిల్లీలో 10AMకు CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, నిర్మలా సీతారామన్‌, మంత్రి లోకేశ్‌ సమక్షంలో MOUపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ప్రభుత్వం చెబుతోంది.

News October 14, 2025

వైకుంఠ గంగే స్వామివారి పుష్కరిణి

image

తిరుమల కొండతో పాటు, స్వామి పుష్కరిణిని కూడా గరుత్మంతుడు వైకుంఠం నుంచి భూమిపైకి తెచ్చాడు. ఇది శ్రీదేవి, భూదేవిలకు ప్రియమైనది. దీన్ని సర్వతీర్థాలకు జన్మస్థానంగానూ భావిస్తారు. విరజా నదిలా సకల పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఐహిక ఫలాలన్నీ లభిస్తాయి. ఈ పుష్కరిణిని దర్శించడం, స్మరించడం, సేవించడం వలన సమస్త శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>