News September 20, 2024

సచివాలయంలో క్యాబినెట్ సమావేశం

image

TG: సచివాలయంలో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడం, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనున్నారు. తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Similar News

News November 20, 2025

KTR ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. రేవంత్ ఏం చేస్తారో చూడాలి: సంజయ్

image

TG: రాష్ట్రంలో RK (రేవంత్, కేటీఆర్) పాలన నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇంతకాలం కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఏం చేస్తారో, ఏం చెప్తారో చూడాలి. వాళ్లిద్దరి దోస్తానా ఇప్పుడు బయటపడుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News November 20, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 10

image

56. స్నానం అంటే ఏమిటి? (జ.మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? (జ.సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? (జ.ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (జ.ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)
60. ఏది కాయం? (జ.సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 20, 2025

APPLY NOW: NRDCలో ఉద్యోగాలు..

image

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NRDC<<>>)లో 3 కాంట్రాక్ట్ అసిస్టెంట్ మేనేజర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఎంఈ/ఎంటెక్, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nrdcindia.com