News January 4, 2025
క్యాబినెట్ భేటీ ప్రారంభం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం పలు విషయాలపై చర్చించనున్నారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని పేదలకు జీవన భృతి వంటి విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 6, 2025
సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ: టీపీసీసీ చీఫ్
TG: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లలో విజయం సాధిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విజయం కార్యకర్తల కష్టానికి ప్రతిఫలమని తెలిపారు.
News January 6, 2025
‘సూర్య ఘర్’తో ప్రజలకు అదనపు ఆదాయం: చంద్రబాబు
AP: ‘సూర్య ఘర్’ పథకంతో ప్రజలు అదనపు ఆదాయం పొందొచ్చని CM చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా ప్రతి ఇల్లూ 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. కుప్పం సభలోCM మాట్లాడారు. ‘ప్రతి ఇల్లు నెలనెలా 60 యూనిట్లు వినియోగించుకోవచ్చు. మిగతా 140 యూనిట్లు గ్రిడ్‌కు విక్రయించవచ్చు. దీంతో ఏటా రూ.4 వేల విలువైన విద్యుత్ ఉచితంగా వాడుకోవచ్చు. గ్రిడ్‌కు అమ్మగా రూ.5 వేల అదనపు ఆదాయం వస్తుంది’ అని పేర్కొన్నారు.
News January 6, 2025
రాష్ట్రంలో కొత్తగా 18 లక్షల మంది ఓటర్లు: ఈసీ
TG: రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ సవరించింది. ఈసీ విడుదల చేసిన కొత్త జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,66,41,489 మంది, స్త్రీలు 1,68,67,735 మంది ఉన్నారు. 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. కాగా గత ఎన్నికల ముందు రాష్ట్రంలో 3,17,17,389 మంది ఓటర్లు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 18 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు.