News May 18, 2024
కేబినెట్ మీటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ వస్తుందా? రాదా?
తెలంగాణ కేబినెట్ సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమావేశం నిర్వహణపై ప్రభుత్వం ఈసీ అనుమతి కోరగా, ఇంకా రాలేదు. సాయంత్రంలోగా ఈసీ అనుమతి రాకపోతే అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
Similar News
News December 25, 2024
మరోసారి సత్యాగ్రహం: కాంగ్రెస్
నవ సత్యాగ్రహం పేరుతో మరోసారి సత్యాగ్రహ స్ఫూర్తిని రగిలించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో తెలిపింది. 1924, డిసెంబరు 26న కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీజీ పగ్గాలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బెళగావిలో రేపు ‘నవ సత్యాగ్రహ బైఠక్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఎల్లుండి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.
News December 25, 2024
మధుమేహులు ఇలా చేయడం మంచిది: నిపుణులు
డయాబెటిస్‌తో ఇబ్బందిపడేవారు జీవితంలో నడకను భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 150 నిమిషాల నడక ఉండాలని పేర్కొంటున్నారు. ‘మధుమేహులు రోజుకు అరగంట చొప్పున వారంలో కనీసం 5 రోజులు నడవాలి. డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావడంలో వాకింగ్ మంచి ఫలితాన్నిస్తుంది. ఒకేసారి అరగంట నడవలేకపోతే 10 నిమిషాల చొప్పున మూడు లేదా నాలుగుసార్లు నడుస్తున్నా ప్రయోజనం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
News December 25, 2024
ఆరుగురిని పెళ్లాడిన కిలేడీ.. చివరకు..!
ఢిల్లీకి చెందిన ఓ యువతి ఆరు పెళ్లిళ్లు చేసుకుని.. ఏడోదానికి సిద్ధమవుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ పెళ్లి కుమార్తెగా, సంజన ఆమె తల్లిగా నటిస్తూ ఒంటరిగా ఉండే పురుషులను టార్గెట్ చేస్తారు. ఇలా పూనమ్ ఆరుమందిని పెళ్లాడింది. పెళ్లైన వెంటనే ఇంట్లోని బంగారం, నగదుతో ఉడాయిస్తారు. UPకి చెందిన శంకర్ ఉపాధ్యాయ్‌ను కూడా వీరు మోసం చేయాలని చూడగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.