News August 7, 2024

కాసేపట్లో క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు!

image

ఏపీ క్యాబినెట్ సమావేశం ఇవాళ ఉ.11 గంటలకు జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో గుంటూరు, బాపట్ల(D) వేటపాలెంలో పర్యటించనున్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొని కార్మికులతో సమావేశమవుతారు.

Similar News

News March 12, 2026

అనంతపురంలో YCP ఆవిర్భావ వేడుకలు

image

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా పార్టీ అడుగులు వేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News March 12, 2026

రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలి: కోలీవుడ్

image

తమిళ దిగ్గజ నటుడు MGRపై ఇటీవల రాజేంద్రప్రసాద్ చేసిన వివాదాస్పద <<19346659>>వ్యాఖ్యలపై<<>> కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళ ఆరాధ్య దైవాన్ని కించపరచడం తగదని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రముఖ యాక్టర్స్ నాజర్, విశాల్ డిమాండ్ చేశారు. కాంతారావు గొప్ప నటుడని, కానీ ఆయన్ని పొగిడే క్రమంలో మరో యాక్టర్‌ను తక్కువ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.

News March 12, 2026

సాఫ్ట్‌వేర్ కంపెనీలను రీప్లేస్ చేసే ‘మాక్రోహార్డ్’!

image

సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేయగలిగే అన్ని పనులను చక్కబెట్టే AI టూల్స్‌ను సిద్ధం చేయడం కోసం మస్క్ మాక్రోహార్డ్ ప్రాజెక్టును ప్రకటించారు. టెస్లా డిజిటల్ ఆప్టిమస్, గ్రోక్ LLM టెక్‌ను వాడి వీటిని తయారు చేయనున్నట్లు చెప్పారు. చౌకగా దొరికే టెస్లా AI4 చిప్స్‌ను వాడనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ కుదిపేస్తున్న తరుణంలో మస్క్ ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.