News October 16, 2025
మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. సురేఖ వస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా, రెడ్లంతా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 16, 2025
వేపాకుల కండిషనర్‌తో చుండ్రుకు చెక్

అమ్మాయిలకు జుట్టే అందం. ఒత్తయిన వెంట్రుకల కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి బదులు ఇంట్లోనే వేపాకులతో తయారుచేసుకున్న హెయిర్ కండిషనర్ మేలంటున్నారు నిపుణులు. ‘వేపాకులను నీళ్లలో మరిగించి గుజ్జుగా చేసి కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం, రాలిపోవడమూ తగ్గుతుంది’ అని చెబుతున్నారు.<<-se>>#HairCare<<>>
News October 16, 2025
బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్‌ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.
News October 16, 2025
లోకేశ్ కౌంటర్ కర్ణాటక ఐటీ మంత్రికేనా?

గూగుల్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.22వేల కోట్ల రాయితీలు ఇస్తోందని, అందుకే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే నిన్న వ్యాఖ్యానించారు. అలాంటి రాయితీలు తాము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని పలువురు విమర్శిస్తారని చెప్పారు. ఈ కామెంట్లకే ఏపీ మంత్రి లోకేశ్ <<18020050>>కౌంటర్<<>> ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రా పెట్టుబడులు సెగ పొరుగువారికి తగులుతోందని ట్వీట్ చేశారు.