News August 30, 2025
అసెంబ్లీలో క్యాబినెట్ సమావేశం.. 42శాతం రిజర్వేషన్ల జీవోపై చర్చ

TG: అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరుతూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం.
Similar News
News January 24, 2026
ఇండియాకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టారిఫ్స్?

భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న 50% టారిఫ్స్‌ను సగానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హింట్ ఇచ్చింది. ‘రష్యా ఆయిల్ కొనుగోలును ఇండియా తగ్గించింది. సుంకాలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉంటుందని భావిస్తున్నాను’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నామనే కారణంతో ఇండియన్ ప్రొడక్ట్స్‌పై US 25% అదనపు సుంకాలు విధిస్తోంది.
News January 24, 2026
ప్రియాంక చోప్రాకు మహేశ్ బాబు ప్రశంసలు

హీరోయిన్ ప్రియాంక చోప్రాను ప్రశంసిస్తూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఆమె లీడ్ రోల్ చేసిన ‘The Bluff’ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజైంది. యాక్షన్ ట్రైలర్‌లో ప్రియాంక అద్భుతంగా నటించారని పొగిడారు. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
News January 24, 2026
ప్రైస్‌తో పనిలేదు.. కొంటూనే ఉంటా: బంగారం, వెండిపై రాబర్ట్ కియోసాకి

బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పెరిగినా, తగ్గినా తనకు అనవసరమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి చెప్పారు. ప్రభుత్వాలు అప్పులు పెంచుకుంటూ పోవడం వల్ల కరెన్సీ విలువ పడిపోతోందని, పేపర్ మనీ కంటే ఈ ‘రియల్ అసెట్స్’ వైపే మొగ్గు చూపుతానని వివరించారు. పాలసీ మేకర్ల నిర్ణయాల వల్ల మార్కెట్‌లో అనిశ్చితి ఉంటే షార్ట్ టర్మ్ ధరల గురించి టెన్షన్ పడకుండా సంపదను పోగు చేసుకోవడమే తెలివైన పని అని వివరించారు.


