News July 10, 2024
16న కేబినెట్ భేటీ

AP: ఏపీ కేబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ సహా పలు కీలక అంశాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆయా అంశాల సమాచారాన్ని సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ శాఖల ప్రత్యేక సీఎస్‌లు, పీఎస్‌లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
Similar News
News February 28, 2025
కంగారూలపై ప్రతీకారం తీర్చుకుంటారా?

2023 వన్డే WCలో అఫ్గానిస్థాన్ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టింది. మ్యాక్స్‌వెల్ వీరోచిత పోరాటంతో కంగారూలు ఓటమి నుంచి తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ రెండు జట్లు నేడు CTలో మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ENGను ఓడించి జోరు మీద ఉన్న అఫ్గాన్.. ఆస్ట్రేలియన్లకు షాక్ ఇచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి. స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ లాంటి సీనియర్ బౌలర్లు లేకపోయినా AUSను తక్కువ అంచనా వేయలేం.
News February 28, 2025
పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే బంద్

TG: ప్రీ వెడ్డింగ్ షూట్, చెవులు పగిలేలా డీజే డాన్సులు పెళ్లిళ్లలో కామన్ అయిపోయాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ తండావాసులు సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఉట్నూర్ మం. శ్యాం నాయక్ తండా వాసులందరూ సమావేశమై.. ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే, హల్దీ వంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నామన్నారు. సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్?
News February 28, 2025
రాష్ట్రంలో 100 కొత్త పోలీస్ స్టేషన్లు?

TG: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలతోపాటు మహిళా పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 844 పీఎస్‌లు ఉన్నాయి.