News October 11, 2024
ఈ నెల 16న క్యాబినెట్ భేటీ

AP: ఈ నెల 16న అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. నిన్న జరగాల్సిన క్యాబినెట్ భేటీ రతన్ టాటా మరణంతో వాయిదా పడింది. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్దు, పీ-4 విధానం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం, అమరావతి నిర్మాణాలపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం.
Similar News
News December 6, 2025
వాస్తుతో తలరాతను మార్చుకోవచ్చా?

కార్యసాధన, పట్టుదలతో బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రయత్నానికి ఇంటి వాస్తు కూడా దోహదపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘వాస్తు నియమాలు పాటిస్తే.. పంచభూతాల ఆధారంగా మన ఆలోచనలు, నడవడిక, శక్తి సానుకూలంగా మారుతాయి. దీనివల్ల సమయస్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మనకు వచ్చే అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోగలుగుతాం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 6, 2025
95% కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో

95% నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించినట్లు ఇండిగో తెలిపింది. నిన్న 700కు పైగా సర్వీసులు అందుబాటులో ఉంచగలిగామని ఈరోజు మొత్తంలో 1500 ఫ్లైట్లను నడుపుతున్నామని శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘138 గమ్యస్థానాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించాం. మా ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. సంక్షోభంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని చెప్పింది.
News December 6, 2025
కోట్ల మందికి తాగునీటి కొరత!

2050 నాటికి కోట్ల మందికి తాగునీరు అందని పరిస్థితి తలెత్తవచ్చని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. వియన్నాకు చెందిన కాంప్లెక్సిటీ సైన్స్ హబ్, ప్రపంచ బ్యాంక్ కలిసి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని 100కు పైగా నగరాలను పరిశీలించాయి. ఇష్టారీతిన విస్తరించుకుంటున్న నగరాల వలన 220M మందికి స్వచ్ఛమైన నీరు అందదని వెల్లడించింది. సరైన ప్రణాళిక ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని సూచించింది.


