News September 13, 2024
ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. వరద నష్టం, కొత్తవారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులు క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.
Similar News
News September 18, 2025
నవ గ్రహాలు – భార్యల పేర్లు

సూర్యుడు – ఉష, ఛాయ
చంద్రుడు – రోహిణి
కుజుడు – శక్తి దేవి
బుధుడు – జ్ఞాన శక్తి దేవి
గురుడు – తారా దేవి
శుక్రుడు – సుకీర్తి దేవి
శని – జేష్ఠా దేవి
రాహువు – కరాళి దేవి
కేతువు – చిత్రాదేవి
News September 18, 2025
తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.
News September 18, 2025
Maturity Laws: ఇవి పాటించు గురూ!

* అందరికీ ప్రతీది చెప్పడం మానేయండి. ఎందుకంటే చాలా మంది వాటిని పట్టించుకోరు. బలహీనతలను అస్సలు చెప్పొద్దు
* స్నేహితులను తెలివిగా ఎంచుకోండి. సరైన స్నేహితులే మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తారు
* ఏమీ ఆశించకండి. అభినందించడం నేర్చుకోండి
* మీ వంతు కృషి చేయండి. ఫలితమేదైనా స్వీకరించండి.
* ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టండి.
* పరిస్థితులకు తగ్గట్లు స్పందించడం అలవాటు చేసుకోండి.