News November 13, 2024

ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం

image

AP: నవంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అత్యవసరంగా భేటీ కానుంది. కాగా ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Similar News

News February 1, 2026

‘పంచభక్ష్య పరమాన్నాలు’ అంటే తెలుసా?

image

మంచి భోజనాన్ని మన పెద్దలు ‘పంచభక్ష్య పరమాన్నాలు’ అని పిలుస్తుంటారు. దీని అర్థం మనం తినే పదార్థాలు ఐదు రకాలుగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
భక్ష్యం: గారెలు, బూరెలు వంటి కొరికి తినే పదార్థాలు.
భోజ్యం: పులిహోర, దద్ధోజనం వంటి నమిలి తినేవి.
చోష్యం: పాయసం, చారు వంటి జుర్రుకునేవి.
లేహ్యం: తేనె, చలివిడి వంటి నాకబడేవి.
పానీయం: నీళ్లు, పండ్ల రసం వంటి తాగే పదార్థాలు.

News February 1, 2026

భారత్ U19 జట్టు ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

image

U19 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న సూపర్-6 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో వేదాంత్ త్రివేది(68) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. చౌహన్ (35), అంబ్రిష్ (29), వైభవ్ (30) రాణించారు. చివరి 10 ఓవర్లలో భారత్ 72 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. పాక్ సెమీస్ వెళ్లాలంటే 33.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి.

News February 1, 2026

‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోకపోతే..

image

AP: రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ 13L మంది రిజిస్టర్ చేసుకోలేదు. వీరు PM కిసాన్-అన్నదాత సుఖీభవ(ఏటా ₹20K) నిధులు పొందలేరని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలు లేదా APAIMS 2.0 యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ-పంట నమోదునూ రైతులే యాప్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.