News October 18, 2024
ఈనెల 23న క్యాబినెట్ భేటీ.. వీటికి గ్రీన్ సిగ్నల్?

TG: రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 23న భేటీ కానుంది. రైతు భరోసా విధి విధానాలు, మూసీ నిర్వాసితులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఫ్యామిలీ హెల్త్ డిజిటల్ కార్డు ప్రాజెక్టు, అసెంబ్లీ సమావేశాల తేదీపై చర్చించనుంది. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, హైడ్రాకు మరిన్ని అధికారాలు, గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి వంటి అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
Similar News
News November 28, 2025
‘థర్డ్ వరల్డ్’ దేశాల లిస్ట్‌లో భారత్ ఉందా?

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను నిలిపివేస్తామని ట్రంప్<<18410545>> ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ‘థర్డ్ వరల్డ్’ పదం ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాపులర్ అయింది. అప్పట్లో అమెరికా-నాటో దేశాలు ఫస్ట్ వరల్డ్, సోవియట్ యూనియన్ అనుబంధ దేశాలు సెకండ్ వరల్డ్‌గా, ఏ పక్షానికీ చేరని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాలను ‘థర్డ్ వరల్డ్’ అని పిలిచేవారు. UN LDCs లిస్ట్ ప్రకారం ఇందులో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో భారత్ లేదు.
News November 28, 2025
మేనరిక వివాహాలు చేసుకుంటున్నారా?

మేనరికపు వివాహాలు చేసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వివాహం అయితే జెనెటిక్ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్ కారణాలతో గర్భస్రావం అవుతుంటే కార్యోటైప్ టెస్ట్, అబార్షన్ అయితే పిండానిదీ, తల్లిదండ్రులదీ జెనెటిక్ మేకప్ చేయించుకోవాలి. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ముందే చెక్ చేయించుకోవాలి.
News November 28, 2025
అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం

AP: రాజధాని అమరావతి పరిధిలో రెండోదశ భూసమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 7 గ్రామాల (వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి) పరిధిలోని 16,666.5 ఎకరాలను సమీకరించాలని CRDAకు అనుమతి ఇచ్చింది. దీంతో ల్యాండ్ పూలింగ్‌కు CRDA నోటిఫికేషన్ ఇవ్వనుంది. కాగా తొలివిడతలో ప్రభుత్వం 29 గ్రామాల్లోని 30వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించిన విషయం తెలిసిందే.


