News June 13, 2024

రుణమాఫీపై 15 లేదా 18న కేబినెట్ భేటీ

image

TG: రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రుణ మాఫీకి ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి? అర్హుల గుర్తింపునకు విధివిధానాల రూపకల్పన, నిధుల సమీకరణ మార్గాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు సమాచారం.

Similar News

News November 25, 2025

వేములవాడ ఆసుపత్రిలో ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

image

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం జరిగింది. ఈ శిబిరంలో మొత్తంగా 31 మంది మగవారికి కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు పెంచలయ్య, రమేష్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News November 25, 2025

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

image

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్‌బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.

News November 25, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

image

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>