News October 28, 2024
NOV 6న క్యాబినెట్ భేటీ.. పూర్తిస్థాయి బడ్జెట్‌పై నిర్ణయం?

AP: CM చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 6న క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించేందుకు ప్రతిపాదనలను నవంబర్ 4వ తేదీ సా.4 గంటలలోపు పంపాలని అన్ని శాఖలను CS నీరబ్ ఆదేశించారు. ఈ భేటీలో పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్‌తో ముగియనుంది.
Similar News
News January 19, 2026
5 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని ట్వీట్ చేసింది. కాగా నవీన్ కెరీర్లో ఇదే తొలి రూ.100 కోట్ల మార్క్ మూవీ కావడం విశేషం.
News January 19, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

గువాహటిలోని <
News January 19, 2026
దావోస్‌కు సీఎం.. సింగపూర్ అధ్యక్షుడితో భేటీ

AP: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు. అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సమావేశం అయ్యారు. అంతకుముందు జ్యురిచ్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.


