News August 23, 2025

సెప్టెంబర్ 4న మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబర్ 4న వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా సెప్టెంబర్ రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.

Similar News

News March 13, 2026

పంట రుణాల పరిమితి ఖరారు

image

TG కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ FY2026-27కి గాను పంట రుణాల పరిమితిని ఖరారు చేసింది. ఎకరా వరి సాధారణ సాగుకు ₹48,000, SRIకి ₹38K, విత్తనోత్పత్తికి ₹51K, పత్తి(నీటి వసతి) ₹52K, వర్షాధారం ₹50K, విత్తనోత్పత్తికి ₹1.50Lగా నిర్ణయించింది. మిరప(సాధారణ సాగు) ₹90K, మల్చింగ్ ₹లక్ష, మొక్కజొన్న(₹38K, ₹32K, స్వీట్‌కార్న్ ₹43K), కంది(₹27K, ₹23K, ₹25K), పసుపు ₹92K, టమాటా ₹58K, ఉల్లి ₹49K, పెసలు (₹20K, ₹22K)గా ఉంది.

News March 13, 2026

డాల్బీ ఫార్మాట్‌లో ‘పెద్ది’

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్‌లో విడుదల(ఏప్రిల్ 30) కానున్న తొలి టాలీవుడ్ మూవీగా నిలవనుంది. దీంతో హైపర్ రియలిస్టిక్ వీడియో, అద్భుతమైన సౌండ్‌తో చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు వార్-2, కాంతార-2, GOAT చిత్రాలు రిలీజయ్యాయి.

News March 13, 2026

8th క్లాస్‌తోనే ఐటీఐ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: 8వ తరగతిలోనే చదువు ఆపేసిన వారు జీవితంలో ఎదిగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8th క్లాస్ పాసైన వారూ ITI కోర్సుల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని HRD శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వారు ఇక్కడ చదువుతూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో టెన్త్ పాసయ్యేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే వృత్తి పనులు చేస్తున్నవారి స్కిల్స్ పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు.