News October 6, 2025

ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

image

AP: వారం వ్యవధిలోనే మంత్రి వర్గం <<17905338>>మరోసారి<<>> సమావేశం కానుంది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.

Similar News

News October 6, 2025

మస్క్ సంస్థకు US ఆర్మీ రూ.6K Cr కాంట్రాక్టు

image

స్పేస్ ఎక్స్ సంస్థ భారీ US మిలిటరీ కాంట్రాక్టు పొందింది. వచ్చే ఆర్థిక సం.లో ఆర్మీ చేపట్టే 7 కీలక రాకెట్ లాంచ్‌లలో 5 మస్క్ సంస్థకు దక్కాయి. నేషనల్ సెక్యూరిటీ స్పేస్ లాంచ్ ప్రోగ్రాం(NSSL) కింద జరిగిన ఈ ఒప్పంద విలువ $714 మిలియన్లు (₹6,339 కోట్లు). ట్రంప్-మస్క్ మధ్య చెడిన మైత్రి మళ్లీ కుదిరాక ఇది జరగడం గమనార్హం. ఇక అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ సంస్థకు అర్హతలు లేవని కాంట్రాక్ట్ ఇవ్వలేదు.

News October 6, 2025

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

image

2025కు సంబంధించి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. రోగనిరోధక శక్తిపై పరిశోధనలకు గాను మేరీ బ్రాంకౌ (అమెరికా), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి.

News October 6, 2025

విష్ణువుపై వ్యాఖ్యలు.. CJIపై దాడికి కారణమిదేనా?

image

SCలో CJI BR గవాయ్‌పై ఓ వ్యక్తి వస్తువు విసిరేందుకు యత్నించడం తెలిసిందే. MPలోని ఖజురహో టెంపుల్‌లో ధ్వంసమైన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై విచారణ సమయంలో CJI వ్యాఖ్యలే దాడికి కారణంగా తెలుస్తోంది. ‘ఈ సైట్ ASI పరిధిలో ఉంది. మీరు విష్ణువు పరమ భక్తుడని చెబుతున్నారు కదా. వెళ్లి ప్రార్థించండి. ఏదైనా చేయమని అడగండి’ అంటూ పిటిషన్‌ను కొట్టేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.