News December 13, 2024

ఈ నెల 16న క్యాబినెట్ భేటీ

image

TG: ఈ నెల 16న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీలో కమిటీ హాల్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలుకుతుందని తెలుస్తోంది.

Similar News

News February 4, 2026

క్రికెట్‌లో కొత్త రూల్స్: స్టంపింగ్‌లో బాల్ చేతికి తగిలితే సరిపోదు!

image

క్రికెట్ రూల్స్‌ను నిర్ణయించే MCC కొన్ని కీలక మార్పులు చేసింది. రనౌట్‌ లేదా స్టంపింగ్ చేసేటప్పుడు బాల్ కేవలం చేతికి తగిలితే సరిపోదు. దానిపై పూర్తి కంట్రోల్ ఉండాలి. టెస్ట్ క్రికెట్‌లో రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడినా సరే ఆ ఓవర్ పూర్తి చేయాల్సిందే. అలాగే బౌలర్ రన్‌అప్ నుంచి కాకుండా బాల్ రిలీజయ్యాక కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ వెనక ఉంటే సరిపోతుంది. ఈ మార్పులు అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

News February 4, 2026

వాట్సాప్‌పై సుప్రీం ఆగ్రహం.. అసలు ఏం జరిగింది?

image

వాట్సాప్‌కు <<19037669>>సుప్రీంకోర్టు<<>> గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 2021లో వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల డేటాను మెటాలోని ఇతర కంపెనీలతో షేర్ చేసుకుంటామని చెప్పింది. దీనికి అంగీకరిస్తేనే వాట్సాప్ వాడుకోనిస్తాం, లేదంటే అకౌంట్ డిలీట్ చేసుకోండని కండిషన్ పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు..‘భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి’ అని హెచ్చరించింది.

News February 4, 2026

ఫిబ్రవరి 04: చరిత్రలో ఈరోజు

image

☛ 1891: స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం
☛ 1962: సినీ నటుడు రాజశేఖర్ జననం
☛ 1972: దర్శకుడు శేఖర్ కమ్ముల జననం
☛ 1974: సినీ నటి, పొలిటీషియన్ ఊర్మిళ జననం
☛ 2023: సింగర్ వాణి జయరాం మరణం(ఫొటోలో)
☛ వరల్డ్ క్యాన్సర్ డే
☛ శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం