News February 22, 2025

ఈ నెల 28న క్యాబినెట్ భేటీ

image

AP: ఈ నెల 28న అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారని తెలుస్తోంది.

Similar News

News February 23, 2025

TODAY HEADLINES

image

* APలో రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం
* CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
* మిర్చి రైతులతో CM చంద్రబాబు కీలక భేటీ
* దేశంలో ఏ CM చేయని సాహసం చేస్తున్నా: రేవంత్
* అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం
* SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు
* టెస్లాకు AP భారీ ఆఫర్.. లోకేశ్ ప్రత్యేక చొరవ!
* ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై ఆసీస్ విజయం

News February 23, 2025

అపోలో ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు మెడికల్ టెస్టులు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో స్కానింగ్ చేయించుకున్నారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని డాక్టర్లు తెలిపారు. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన టెస్టులు చేయించుకుంటారని పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ హాజరవుతారని వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం పవన్ వైరల్ ఫీవర్, వెన్నునొప్పితో బాధపడ్డారు.

News February 23, 2025

రేపు భారత్vsపాకిస్థాన్.. ఎక్కడ చూడాలంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ: రేపు భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం కావడంతో కోట్లాది మంది ఈ మ్యాచ్ చూడనున్నారు. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు. జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ చూడొచ్చు. దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో రేపు మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. Way2newsలో లైవ్ స్కోర్ పొందవచ్చు.
ALL THE BEST TEAM INDIA

error: Content is protected !!