News December 23, 2024
ఈ నెల 30న క్యాబినెట్ భేటీ

తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.
Similar News
News January 5, 2026
గంట మోగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.
News January 5, 2026
AERAIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News January 5, 2026
నీటి ప్రాజెక్టుల రుణాల కోసం CM చర్చలు

TG: ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా ముంబైలోని పెద్ద ఫైనాన్స్ కంపెనీతో CM రేవంత్, మంత్రి ఉత్తమ్ ఆదివారం మొదటి విడత చర్చలు జరిపారు. అయితే ఏ కంపెనీతో చర్చిస్తుందో వెల్లడి కాలేదు. ప్రాణహిత-చేవెళ్ల, ఇతర ప్రధాన ప్రాజెక్టుల కోసం భారీ నిధులు అవసరం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో RBIతో చర్చలకు అధికారులు సిద్ధమవుతున్నారు.


