News August 27, 2025
క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 29న క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఈనెల 30కి రీషెడ్యూల్ చేసింది. ఆ రోజు మ.ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Similar News
News August 27, 2025
ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్ టేలర్ స్విఫ్ట్

ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన ప్రియుడిని పెళ్లి చేసుకోనున్నారు. NFL ప్లేయర్ ట్రావిస్ కెల్సేతో రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు IGలో పోస్ట్ చేశారు. ‘మీ ఇంగ్లిష్ టీచర్, జిమ్ టీచర్ వివాహం చేసుకోబోతున్నారు’ అని రాసుకొచ్చారు. తనను తాను ఇంగ్లిష్ టీచర్‌గా టేలర్ పేర్కొనడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.
News August 27, 2025
పంచాయతీలకు రూ.1,120 కోట్ల విడుదలకు సీఎం హామీ: పవన్

AP: సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నట్లు Dy.CM పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. రూ.1,120 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వినియోగిస్తూ కనీస మౌలిక వసతులు, సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
News August 27, 2025
ఆగస్టు 27: చరిత్రలో ఈ రోజు

1908: ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం(ఫొటోలో)
1957: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జననం.
1963: నటి సుమలత జననం.
1972: రెజ్లర్ గ్రేట్ ఖలీ జననం.
2010: తెలుగు వైద్యుడు కంభంపాటి స్వయంప్రకాష్ మరణం