News December 16, 2024
ఇవాళ క్యాబినెట్ సమావేశం

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మ.2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రెవెన్యూ చట్టం ROR బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించనున్నారు. ఇద్దరికి మించి పిల్లలున్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీ రాజ్ చట్టసవరణ చేయనున్నట్లు సమాచారం. అలాగే రైతు భరోసా విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది.
Similar News
News February 2, 2026
‘పవార్ ప్లే’ మళ్లీ మొదలవుతుందా?

మహారాష్ట్ర Dy.CM, NCP చీఫ్ అజిత్ పవార్ అకాల మరణంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో గ్యాప్ ఏర్పడింది. దీనిని భర్తీ చేసేందుకు బాబాయ్ శరద్ పవార్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చీలిపోయిన NCPని మళ్లీ కలిపేందుకు కృషి చేస్తూనే బారామతి, పుణే వంటి పవార్ల కంచుకోటలపై పట్టుసడలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పవార్ ఇప్పుడు యాక్టివ్ అవడం ‘మహా’ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
News February 2, 2026
కుసుమలో పేనుబంక, శనగపచ్చ పురుగు నివారణ

రబీ సీజన్‌లో సాగు చేస్తున్న కుసుమ పంట పూత దశలో పేనుబంక తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ML లేదా ఎసిఫేట్ 1.5గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కుసుమను శనగపచ్చ పురుగు ఆశిస్తే దీని నివారణకు లీటరు నీటిలో క్లోరోపైరిఫాస్ 25 ఇసి 2.5ML లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News February 2, 2026
ఆడపిల్లలు గడపపై కూర్చుకూడదా?

ఇంటి ప్రధాన ద్వారం గడపను లక్ష్మీదేవి నివాసస్థానంగా భావిస్తారు. అందుకే గడపపై ఆడపిల్లలు కూర్చోవడం లక్ష్మీదేవిని అగౌరవ పరిచినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. గడపపై కాలు పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇల్లు వీడుతుందని నమ్మకం. ఇంటి పురోగతిని కోరేవారు ఇలాంటి పనులు చేయకూడదు.


