News March 6, 2025
నేడు క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సమగ్ర కులగణనకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.
Similar News
News March 6, 2025
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగివ్వాలి: జైశంకర్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌కు ఇస్తేనే అక్కడి సమస్య పరిష్కారమవుతుందని కేంద్రమంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం కశ్మీర్ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. లండన్‌లోని ఛాఠమ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్ పాలన సాగుతోందని, భారత్‌కు అది సరిగ్గా సరిపోతుందని తెలిపారు.
News March 6, 2025
ఈ పరంపరని బ్రేక్ చేయాల్సిందే.. ఏమంటారు?

CT ఫైనల్లో న్యూజిలాండ్‌తో IND తలపడనుంది. గ్రూప్ స్టేజీలోనే NZని ఇండియా చిత్తు చేసిందని, ఫైనల్లో గెలుపు మనదేనని కొందరు IND ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జరిగిన కొన్ని టోర్నీలను మరికొందరు గుర్తుచేస్తున్నారు. 2017 CTలో గ్రూప్ స్టేజీలో పాక్‌ను ఓడించినా ఫైనల్లో అదే టీమ్‌పై ఇండియా ఓడిపోయింది. 2023 ODI WCలోనూ ఇలాగే AUS ఫైనల్స్‌లో మనల్ని ఓడించింది. ఈసారి ఇది బ్రేక్ కానుందా?
News March 6, 2025
రంగన్న మృతిపై భార్య అనుమానం.. పోలీసుల దర్యాప్తు

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15662269>>మృతిపై<<>> ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఏదో చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని పులివెందుల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.