News September 20, 2024

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

TG: CM రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.4 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలపనుంది.

Similar News

News November 28, 2025

ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.

News November 28, 2025

చెక్క దువ్వెన వాడుతున్నారా?

image

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్‌ లిక్విడ్‌/ షాంపూ, కొబ్బరి, ఆలివ్‌ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.

News November 28, 2025

మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

image

TG: మహబూబాబాద్(D) మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.