News August 1, 2024
నేడు క్యాబినెట్ భేటీ.. రేషన్ కార్డుల జారీపై చర్చ

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రధానంగా చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేయనుంది. అలాగే నూతన మెడికల్ కాలేజీలకు స్థలాల కేటాయింపు, మూసీ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధుల అంశంపై చర్చించనుంది. రిజర్వాయర్లు, చెరువుల్లో పూడికతీత, బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News November 28, 2025
గిరిరాజ్ కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి

జి.జి.కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కులవివక్షతను ఎదిరిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, స్త్రీవిద్య కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఫూలే స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం పేర్కొన్నారు. దండుస్వామి, రామస్వామి, రంజిత, నహీదా బేగం, వినయ్ కుమార్, పూర్ణచందర్ రావు, రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.


