News October 3, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ 3PMకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈనెల 16న రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ప్రణాళికపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రేపు ఆటో డ్రైవర్లకు అందించనున్న రూ.15 వేల సాయంపై చర్చించే అవకాశముంది. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి సీఆర్డీఏ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు.
Similar News
News October 3, 2025
తిరుమల: శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వ దర్శనానికి 20గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనం కోసం బాట గంగమ్మ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,188 మంది దర్శించుకోగా.. 31,640 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.66కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిన్న ధ్వజావరోహణంతో ముగిసిన విషయం తెలిసిందే.
News October 3, 2025
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ eసిమ్ సేవలు

బీఎస్ఎన్‌ఎల్ ఇకపై యూజర్లకు eసిమ్ కార్డులు జారీ చేయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌తో కలిసి ఈ సేవలను అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. 2G, 3G, 4G నెట్‌వర్క్ యూజర్లకు ఇ-సిమ్ పనిచేస్తుందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
News October 3, 2025
లక్ష్మీదేవికి తామరపువ్వుతో పూజ చేస్తే..

లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుతో ఆమెను శుక్రవారాల్లో పూజించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అలాగే ఎర్రగులాబీ, మందారం పూలతోనూ పూజ చేయొచ్చంటున్నారు. బియ్యం, బెల్లంతో పాయసం చేసి సమర్పించడం వల్ల దేవి సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని పేర్కొంటున్నారు. ఇంట్లో శ్రేయస్సు, మనశ్శాంతి లభిస్తుందని, డబ్బు సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని తెలుపుతున్నారు.