News January 2, 2025
రైతు భరోసాపై నేడు క్యాబినెట్ సమావేశం
TG: రైతు భరోసాపై క్యాబినెట్ సబ్కమిటీ నేడు సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొంటారని సమాచారం. రైతు భరోసా విధివిధానాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసాను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 4, 2025
క్యాబినెట్ భేటీ ప్రారంభం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం పలు విషయాలపై చర్చించనున్నారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని పేదలకు జీవన భృతి వంటి విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News January 4, 2025
దేశంలో ఎడమ చేతి వాటం కలిగిన వారెందరంటే?
క్లాసులో వంద మంది ఉంటే అందులో ఒకరో, ఇద్దరో ఎడమ చేతి వాటం కలిగిన వ్యక్తులుంటారు. అంటే, ఇలాంటి స్పెషల్ వ్యక్తులు చాలా అరుదన్నమాట. భారతదేశ జనాభాలో వీరు 5.20శాతం మంది ఉన్నారు. అత్యధికంగా అమెరికాలో 13.10 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండగా 12.80శాతంతో కెనడా రెండో స్థానంలో ఉంది. UKలో 12.24%, ఫ్రాన్స్లో 11.15%, ఇటలీలో 10.51%, జర్మనీలో 9.83శాతం మంది ఉన్నారు. మీకు తెలిసిన లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైనా ఉన్నారా?
News January 4, 2025
మేం ఇచ్చిన హామీలు మాకు తెలుసు: మంత్రి పయ్యావుల
AP: తాము ఇచ్చిన హామీలు తమకు తెలుసని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు. ‘వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. దేశంలోని మరే రాష్ట్రానికి ఇన్ని అప్పులు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి వెళ్లిపోయారు’ అని ఆయన ధ్వజమెత్తారు.