News October 25, 2024

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీనికి మంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉండనుండగా ప్రత్యేక ఆహ్వానితుడిగా కే.కేశవరావుని నియమించారు. శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో సబ్ కమిటీ భేటీ కానుంది. కాగా ఇవాళ సాయంత్రంలోపు పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీనిచ్చారు.

Similar News

News October 25, 2024

ఎన్నికలకు కమిటీలను ప్రకటించిన బీజేపీ

image

TG: ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఎంపీ అరవింద్, పాల్వాయి హరీశ్, ఏవీఎన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జి.నగేశ్, ఈటెల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు లభించింది. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించనుంది.

News October 25, 2024

పుస్తకాల బరువుతో పిల్లల్లో ఆ సమస్యలు!

image

పుస్తకాల బ్యాగుల రూపంలో పిల్లల నడుముపై భారాన్ని వేయడం దీర్ఘకాలంలో ప్రమాదకరమని ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యుడు సమీర్ రూపారెల్ పేర్కొన్నారు. ‘బ్యాగుల బరువు వల్ల ప్రతి 10మందిలో 8మంది చిన్నారులకి వెన్ను సమస్యలు వస్తున్నాయి. బ్యాగుల బరువు వారి శరీర బరువులో 15శాతాన్ని మించకూడదు. అధిక బరువు వల్ల మెడ, భుజాల నొప్పులు, వెన్ను వంగిపోయే స్కోలియోసిస్ వంటి పరిస్థితులూ తలెత్తవచ్చు’ అని హెచ్చరించారు.

News October 25, 2024

మరో 1,000 పాయింట్లు నష్టపోయే ప్రమాదం!

image

టెక్నిక‌ల్ అనాల‌సిస్ ప్రకారం నిఫ్టీ-50 మ‌రో 1,000 పాయింట్లు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్ టైం హై 26,277 నుంచి నెల కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే 7% (1,899 పాయింట్లు) న‌ష్ట‌పోయిన సూచీ 100 డే మూవింగ్ యావ‌రేజ్(DMA- 24,565) కింద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న 24,399 స్థాయి నుంచి మార్కెట్ పుంజుకోలేక‌పోతే 23,365 (200 DMA)కి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.