News October 27, 2024

20 లక్షల ఉద్యోగాల కల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ

image

AP: 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకునేందుకు విధివిధానాలు రూపొందిస్తోంది. ఈమేరకు ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి లోకేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టనుంది.

Similar News

News February 1, 2026

KCR పేరు వింటేనే మీకు వణుకు: KTR

image

TG: KCRను సిట్ అధికారులు విచారించడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా స్పందించారు. KCR వ్యక్తి కాదని, తెలంగాణ చరిత్ర అని కొనియాడారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని ధీశాలి.. ఇలాంటి చిల్లర రాజకీయాలకు భయపడరన్నారు. ‘మూర్ఖులు చరిత్రను సృష్టించలేరు. అర్థం కూడా చేసుకోలేరు. ఆయన పేరు వింటేనే మీకు వణుకు పుడుతుంది’ అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏం చేసినా KCR కీర్తిని చెరిపేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

News February 1, 2026

ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసింది. మొత్తం 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. తాము సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి విచారణ చేసినట్లు సమాచారం. మొత్తం ఆరుగురు అధికారుల బృందం కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం వాళ్లు నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి వెళ్లిపోయారు.

News February 1, 2026

మీకు తెలుసా! కోయడం బట్టే ఉల్లిపాయ టేస్ట్..

image

కోసే విధానాన్ని బట్టి ఉల్లిపాయ రుచి మారుతుందని మీకు తెలుసా? ఉల్లిపాయను నిలువు(తల నుంచి వేళ్ల వైపు)గా కోస్తే కణాలు తక్కువగా దెబ్బతిని తీపి రుచి వస్తుంది. నాన్‌వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఇవి త్వరగా మెత్తబడి గ్రేవీకి చిక్కదనాన్ని ఇస్తాయి. అడ్డంగా కోస్తే కణాలు విచ్ఛిన్నమై ఘాటు పెరుగుతుంది. సలాడ్ల కోసం ఇవి బెటర్. అయితే అడ్డంగా కోసినప్పుడు ఎంజైమ్స్ ఎక్కువగా విడుదలై కళ్ల నుంచి నీళ్లు అధికంగా వస్తాయి.