News August 29, 2024
నూతన మద్యం పాలసీ రూపకల్పనకు క్యాబినెట్ సబ్ కమిటీ

AP: నూతన మద్యం పాలసీ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రస్తుతమున్న లిక్కర్ పాలసీని సమీక్షించడంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. పాలసీ రూపకల్పనకు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోనుంది.
Similar News
News October 21, 2025
5,800 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

రైల్వేలో 5,800 నాన్ టెక్నికల్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హతతో 18నుంచి 33ఏళ్లు గల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్ పాసైన18 నుంచి 30 ఏళ్లు గల అభ్యర్థులు ఈనెల 28 నుంచి నవంబర్ 27వరకు దరఖాస్తు చేయవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/
News October 21, 2025
రసంపీల్చే పురుగుల కట్టడికి జిగురు అట్టలు

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.
News October 21, 2025
శివ పూజ ఇలా చేస్తే.. అన్ని శుభాలే!

రోజుకు 3 సార్లు చేసే పూజలను త్రికాలార్చనలు అని అంటారు. వాటిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చేస్తారు. ఉదయం చేసే పూజలు నిత్య కర్మలకు అనువైనవి. మధ్యాహ్నం చేసేవి కామ్య కర్మలకు (కోరికలు తీరడం కోసం) తగిన సమయం. సాయంత్ర పూజలు శాంతి కర్మలకు (దోషాలు తొలగిపోవడం కోసం) మంచివి. రాత్రి మధ్య భాగమైన నిశీధ సమయంలో చేసే శివపూజకు గొప్ప ఫలం ఉంటుంది. ఇలాంటి కర్మల ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని నమ్మకం. <<-se>>#SIVOHAM<<>>