News August 2, 2024
తెలంగాణ స్థితిగతులపై కాగ్ నివేదిక

TG: 2023 మార్చితో ముగిసిన ఏడాదికి గాను రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. GSDP 2021-22తో పోలిస్తే 2022-23లో 16శాతం పెరిగిందని తెలిపింది. ‘రెవెన్యూ రాబడులు గణనీయంగా 25% పెరిగాయి. సొంతపన్నుల రాబడి 17% పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2.06 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1.18 లక్షల కోట్లుగా ఉన్నాయి’ అని కాగ్ అంచనా వేసింది.
Similar News
News January 16, 2026
వెండి ‘విశ్వరూపం’: 16 రోజుల్లోనే రూ.50వేలు పెరిగింది!

2026 ప్రారంభంలోనే వెండి ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో జనవరి 1న కేజీ వెండి రూ.2.56 లక్షలు ఉండగా కేవలం 16 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇవాళ రూ. 3.06 లక్షలకు చేరింది. పారిశ్రామికంగా పెరిగిన డిమాండ్, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరా లోటు వల్ల వెండి ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఇన్వెస్టర్లకు వెండి భారీ లాభాలనిస్తోంది.
News January 16, 2026
4 రోజుల్లో రూ.190 కోట్ల కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రప్ఫాడిస్తోంది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.190కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. బుక్ మై షోలో 2మిలియన్లకు పైగా టికెట్లు సోల్డ్ అయినట్లు పేర్కొంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా, వెంకటేశ్ గెస్ట్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే.
News January 16, 2026
ఎమోషన్స్ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. వివిధ పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు తమకు కోపం, భయం, బాధ వస్తే వాటిని లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్ని సన్నిహితులతో పంచుకోవాలని, అలా కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.


