News October 9, 2025
ప్రెగ్నెన్సీలో కాల్షియం లోపం..

ప్రెగ్నెన్సీలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. శిశువు ఎముకలు, దంతాలు అభివృద్ధి చెందడానికి కాల్షియం ఎంతో అవసరం. శిశువుకు కాల్షియం తల్లి నుంచి లభిస్తుంది. తల్లికి కాల్షియం లోపం ఉంటే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడుతుంది. శిశువు గుండె, కండరాలతో పాటు నరాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆహారంలో సోయా, చియా సీడ్స్, బీన్స్, బెండకాయలు చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News October 9, 2025
లిటరేచర్‌లో హంగేరియన్ రచయితకు నోబెల్ ప్రైజ్

2025కి గాను లిటరేచర్(సాహిత్యం) విభాగంలో హంగేరి రచయిత లాస్లో క్రాస్నాహోర్కాయ్(László Krasznahorkai)ను నోబెల్ ప్రైజ్ వరించింది. బైబిల్లోని ఆఖరి కాండానికి (అపోకలిప్సి) కళను జోడించి చేసిన ఊహాత్మక రచనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇప్పటివరకు రాయల్ స్వీడిష్ అకాడమీ మెడిసిన్, ఫిజిక్స్, <<17948685>>కెమిస్ట్రీ<<>> విభాగాల్లో బహుమతులు ప్రకటించింది. ఇంకా ఎకనామిక్ సైన్స్, పీస్ విభాగాల్లో ప్రైజ్‌లు ప్రకటించాల్సి ఉంది.
News October 9, 2025
పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: వాకిటి

TG: ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే బీసీల నోటి కాడ ముద్ద లాక్కుంటున్నారని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టు వద్ద మాట్లాడారు. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో వెనక్కి పోయేదేలేదని మంత్రి స్పష్టం చేశారు. BRS, BJP కుమ్మక్కు వల్లే HC స్టే విధించిందని మంత్రి జూపల్లి ఆరోపించారు.
News October 9, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీలు, IT సంస్థలు, ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో నెలకొక పెయిడ్ లీవ్ చొప్పున ఇవ్వాలని వెల్లడించింది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.