News March 17, 2024

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో ‘కాల్ సెంటర్’

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆదివారం తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు 1950, 08672-2252533కి ఫోన్ చేసి సందేహాలు, ఫిర్యాదులు చేయొచ్చని కలెక్టర్ చెప్పారు.

Similar News

News January 30, 2026

ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉద్యోగ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించిన పలు సమస్యలను వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

News January 29, 2026

కడప స్మార్ట్ కిచెన్ భేష్: కలెక్టర్ బాలాజీ

image

కడప సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల నిర్వహణను పరిశీలించేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం కడపలో పర్యటించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్వహణ అద్భుతంగా ఉందని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే ఈ విధానం అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News January 29, 2026

ఉప్పెన బిడ్డ.. వేల కోట్ల అధిపతి!

image

నాగాయలంక (M)కి చెందిన బొండాడ రాఘవేంద్రరావు జీవితం స్ఫూర్తిదాయకం. దివిసీమ ఉప్పెనలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబంలో పుట్టిన ఆయన కష్టపడి చదివి ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. L&T, ఆస్టర్‌ టెలికామ్‌లో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2011లో బొండాడ ఇంజినీరింగ్స్‌ను స్థాపించారు. టెలికామ్‌, విద్యుత్ రంగాల్లో విస్తరించి నేడు రూ. 7500 కోట్ల మార్కెట్‌ విలువతో హురూన్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కింది.