News September 25, 2024

భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు: MLA సుజనా

image

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల పోస్టర్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చెప్పారు. భక్తుల సూచనల కోసం కాల్ సెంటర్ సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Similar News

News September 25, 2024

కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే తెలివి లేదు: మాజీ మంత్రి

image

TG: రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసాని అమలు చేయాలన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం మొదలుపెట్టారని అన్నారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షార్హులు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప, కొత్తవి నిర్మించే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.

News September 25, 2024

ఉక్రెయిన్‌కు మా మద్దతు కొనసాగుతుంది: బైడెన్

image

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనే వరకూ ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నాటో మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉండటంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విఫలమైందని పేర్కొన్నారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కొత్తగా నాటోలో చేరడంతో మరింత బలం చేకూరిందని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంతోపాటు సూడాన్‌లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.

News September 25, 2024

నేడు అకౌంట్లలోకి రూ.25 వేలు

image

AP: వరద బాధితుల అకౌంట్లలో నేడు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. NTR జిల్లా కలెక్టరేట్‌లో బాధితులకు CM చంద్రబాబు పరిహారం అందించనున్నారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ.10వేలు, దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి GOVT ఆర్థిక సాయం ఇవ్వనుంది.