News August 28, 2024

బ్యాంకుల బంద్‌కు పిలుపు.. పలుచోట్ల సేవలకు అంతరాయం

image

దేశ వ్యాప్తంగా బ్యాంకుల బంద్‌కు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కేరళకు చెందిన 13 మంది ఆఫీస్ బేరర్లపై BOI ఇటీవల ఛార్జ్ షీటు దాఖలు చేయడంపై AIBEA ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె కారణంగా పలుచోట్ల సేవలు అందక ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Similar News

News January 30, 2025

ఖవాజా ‘RECORD’ డబుల్ సెంచరీ

image

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ చేశారు. 290 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ద్విశతకం బాదారు. ఈ ఆసీస్ బ్యాటర్‌కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కాగా శ్రీలంకలో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 38 ఏళ్ల ఖవాజా ఇప్పటివరకు 79 టెస్ట్ మ్యాచుల్లో 5వేలకు పైగా రన్స్ చేశారు. ఇందులో 15 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలున్నాయి.

News January 30, 2025

విమాన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం: ట్రంప్

image

అమెరికాలో జరిగిన ఘోర విమాన <<15307610>>ప్రమాదంపై<<>> ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మానవ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని, కంట్రోల్ టవర్ సిబ్బంది వైఫల్యం వల్లే ఇలా జరిగిందని అన్నారు. హెలికాప్టర్ సిబ్బందిని అలర్ట్ చేసి ఉంటే ప్రమాదం తప్పేదని చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

News January 30, 2025

ఎల్లుండి నుంచి ఆ UPI పేమెంట్స్ పనిచేయవు

image

ట్రాన్సాక్షన్ IDలో స్పెషల్ క్యారెక్టర్లు(@, #, &) లేకుండా ఆల్ఫాన్యూమరిక్(ఇంగ్లిష్ అక్షరాలు, నంబర్లు)తోనే IDలు జనరేట్ చేయాలని UPI ఆపరేటర్స్‌ను NPCI ఆదేశించింది. లేదంటే FEB 1 నుంచి ఆయా లావాదేవీలు సక్సెస్ కావని వెల్లడించింది. కాగా ఈ ఆదేశాలను పాటించని యాప్స్‌ ద్వారా యూజర్స్ ట్రాన్సాక్షన్ చేయలేరు. ఫేక్ IDలను నివారించడానికి, లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI తెలిపింది.