News October 14, 2024
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల బంద్‌కు పిలుపు

TG: రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలేదని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్(TPDPMA) తెలిపింది. ఫలితంగా <<14336846>>కళాశాలల<<>> నిర్వహణ భారంగా మారిందని పేర్కొంది. దీంతో బకాయిలు చెల్లించేవరకు రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్‌కు TPDPMA పిలుపునిచ్చింది.
Similar News
News March 10, 2025
షుగర్ బాధితులకు GOOD NEWS

డయాబెటిస్ రోగులకు అవసరమైన ఔషధాల భారం తగ్గనుంది. దేశీయ ఫార్మా కంపెనీలు త్వరలో Empagliflozin జనరిక్ వెర్షన్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. మార్చి 11 నుంచి ఈ డ్రగ్‌పై పేటెంటు ముగుస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రూ.60గా ఉన్న ట్యాబ్లెట్ జనరిక్‌లో రూ.9-14కే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 10.1 కోట్ల మంది షుగర్ పేషంట్లు ఉన్నారు.
News March 10, 2025
అమరావతిలో 13 సంస్థల భూ కేటాయింపులు రద్దు

ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో 13 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేసింది. మరో 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగించాలని నిర్ణయించింది. 16 సంస్థల భూములకు లొకేషన్, ఎక్స్‌టెన్షన్ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని ఆయన ఆరోపించారు.
News March 10, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉన్న VFX పనులు ఇంకా పూర్తికావాల్సి ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని తెలిపాయి. దీనిపై మేకర్స్ ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురైంది.