News July 15, 2024
సచివాలయం ముట్టడికి పిలుపు.. నిరుద్యోగుల ముందస్తు అరెస్ట్

TG: డీఎస్సీ వాయిదా, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలంటూ హైదరాబాద్‌లో రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వారు రోడ్లపైకి రాకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సెక్రటేరియట్ పరిసరాలతో పాటు అక్కడికి వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాగైనా సచివాలయాన్ని ముట్టడిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 24, 2025
వైభవ్ మరో సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ చెలరేగారు. బిహార్ తరఫున ఆడుతున్న అతను అరుణాచల్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ సెంచరీ దిశగా అతని ఇన్నింగ్స్ కొనసాగుతోంది.
News December 24, 2025
డెడ్‌లైన్ @ డెత్‌లైన్: ఊపిరి ఆడని స్థితిలోనూ బాస్ కఠినత్వం

అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకుంటానన్న ఉద్యోగికి బాస్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు SMలో చర్చకు దారితీసింది. బ్రీతింగ్ ఇష్యూ వల్ల వెంటనే డాక్టర్‌ను కలవాలని క్లోజింగ్ టైమ్‌కు కాస్త ముందు అడిగినా కనికరించలేదు ఆ పెద్దమనిషి. డెడ్‌లైన్‌లోపు పని పూర్తి చేయాల్సిందేనని ఇచ్చిన ఆన్సర్ కార్పొరేట్ కల్చర్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎంజాయ్ చేయలేని స్థితిలో ఎంత శాలరీ వస్తే ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
News December 24, 2025
జగన్‌కు జ్వరం.. కార్యక్రమాలు రద్దు: వైసీపీ

AP: మాజీ సీఎం, తమ పార్టీ అధినేత YS జగన్ అస్వస్థతకు గురైనట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు’ అని తెలిపింది.


